ఆదిలాబాద్​లో కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్, వెలుగు: గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు మంజూరు చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాంగ్రెస్ నిర్మల్​జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు ఆదేశాల మేరకు పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ హజర్ హుస్సేన్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కేసీఆర్, కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కాంగ్రెస్ పై నెడుతున్నారని మండిపడ్డారు. కౌన్సిలర్లు తారక రఘు, ఇమ్రాన్ ఉల్లా, నల్లూరు పోశెట్టి, దేవరకోట చైర్మన్ శ్రీనివాస్, మైనార్టీ విభాగం టౌ న్ ప్రెసిడెంట్ మథిన్, నాయకులు అయ్యన్న గారి పోశెట్టి, హర్షద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్​లో..

కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలనపై సీఎం రేవంత్​రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా గురువారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్​ముందు పార్టీ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్​దిష్టి బొమ్మలను దహనం చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని, బీఆర్​ఎస్​నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాయకులు గిమ్మ సంతోష్​, టౌన్​ ప్రెసిడెంట్​గుడిపల్లి నగేశ్, భూపెల్లి శ్రీధర్, కౌన్సిలర్ జాఫర్ అహ్మద్  తదితరులు పాల్గొన్నారు.